Podupu Kathalu: 20 Funny Riddles in Telugu for Kids - Brain-Boosting Telugu Podupu Kathalu with Answers
పొడుపు కధలు తెలుగు జాతి కి సరదా సరదా గా మెదడుకి మేతగా, ఆలోచింప చేసే సాధనాలు telugu podupu kathalu .
నలుగురు కలిసినపుడు ఒకరినొకరు అడిగి, వారు ఆలోచిస్తుంటే, తమాషాగా జవాబులిచ్చి, నవ్వుకోడానికి పనికివస్తాయి. పిల్లల్లో లాజికల్ గా ఆలోచించే శక్తి ని ప్రేరేపిస్తుంటాయి. ఐతే ఈ పోస్ట్‌లో మేము 20 telugu podupu kathalani with answers తో సహా ఇచ్చాము.
1. కిట కిట తలుపులు, కిటారి తలుపులు
ఎప్పుడు మూసిన చప్పుడు కావు, నేను ఎవరిని ?
Ans. కంటి రెప్పలు
2. అడవిలో పుట్టింది, మెదరింట్లో మెలిగింది
వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, నేను ఎవరిని ?
Ans. మురళి
3. చారల పాము, చక్కటి పాము
నూతిలో పాము, నున్ననైనా పాము, నేను ఎవరిని ?
Ans. పోట్లకాయ
4. నాదశ్వరానికి లొంగని త్రాచు,
నిప్పంటించగానే ఆడెత్స్తుంది, నేను ఎవరిని ?
Ans. చిచ్చుబుడ్డి
5. తొడిమ లేని పండు, ఆకు లేని పంట, నేను ఎవరిని ?
Ans. విభూది పండు
6. తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు
కన్ను లెర్రగా ఉండు, రాకాసి కాదు
పాకి పోవు చుండు, పాము కాదు, నేను ఎవరిని ?
Ans. రైలు
7. సన్న తోడవు తొలగిస్తే, కమ్మని వెన్నముద్ద
అందరూ ఇష్టంగా ఆరగిస్తారు, నేను ఎవరిని ?
Ans. అరటిపండు
8. అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే, నేను ఎవరిని ?
Ans. నక్షత్రాలు
9. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని ?
Ans. ములక్కాయ
10. అంగుళం గదిలో, అరవై మంది నివాసం, నేను ఎవరిని ?
Ans. అగ్గిపెట్టె
11. అరచేతి పట్నాన అరవై రంధ్రాలు, నేను ఎవరిని ?
Ans. జల్లెడ
12. ఈ ఇంటికి, ఆ ఇంటికి మధ్య ఒకటే దూలం, నేను ఎవరిని ?
Ans. ముక్కు
13. ఎందరెక్కినా విరగని మంచం, నేను ఎవరిని ?
Ans. అరుగు
14. ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు, అవి ఏంటి ?
Ans. పేలాలు
15. ఎర్రని కోటలో తెల్లని భటులు, అవి ఏంటి ?
Ans. పళ్ళు
16. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు, నేను ఎవరిని ?
Ans. కాకర కాయ
17. కన్ను ఉన్నా తలలేనిది, నేను ఎవరిని ?
Ans. సూది
18. చారెడు కుండలో మానెడు పగడాలు, నేను ఎవరిని ?
Ans. దానిమ్మ పండు
19. చూస్తే ఒకటి, చేస్తే రెండు
తలకు తోకకు ఒకటే టోపీ , నేను ఎవరిని ?
Ans. పెన్ను
20. చూస్తే గజి బిజీ, తింటే కరకర, నేను ఎవరిని ?
Ans. జంతిక