Podupu Kathalu: 20 Easy Telugu Riddles with Answers to Challenge Your Brain!
మిత్రులారా, మీరు కూడా తెలుగు పొడుపు కథలని పరిష్కరించాలనుకుంటున్నారా? ఐతే ఈ పోస్ట్‌లో మేము 20 Easy Telugu Riddles with Answers to Challenge Your Brain సమాధానాలు ఇచ్చాము. ఇది మీ రోజువారీ పని నుండి మీకు కొంత సమయం ఇవ్వడమే కాకుండా మీ మెదడుకు వ్యాయామం ఇస్తుంది.
Telugu podupu kathalu సమాధానంతో ఈ గేమ్ సహాయంతో మీ స్నేహితులు ఎన్ని తెలుగు podupu kathalu ను పరిష్కరించగలరో తెలుసుకోవడానికి, వారికి తెలుగు పొడుపు కథలను పంపండి మరియు వారితో ఆనందించండి.
1. చిత్రమైన చీరకట్టి షికారుకెళ్ళిందో చిన్నది
పూసిన వారింటికే గాని, కాసిన వారింటికి పోనే పోదు. అది ఏంటి ?
Ans. సీతాకోక చిలుక
2. నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించెను ఈ ఓడ! నేను ఎవరిని ?
Ans. ఒంటె (ఎడారి ఓడ)
3. హద్దు లేని పద్దు, అదుపు లేని ఎద్దు
ఎన్నడూ ఆడొద్దూసుమా! నేను ఎవరిని ?
Ans. అబద్దం
4. దాని పువ్వు పూజకు పనికిరాదు,
దాని ఆకు డొప్పగా చేయటానికి సాయపడదు
కానీ దాన్ని అందరూ కోరతారు, నేను ఎవరిని ?
Ans. చింత పండు
5. నాకు నోరు లేదు కానీ మాటలాడుతాను,
చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియ చేస్తాను, నేను ఎవరిని ?
Ans. మైకు
6. క్రమమైన పయనం, నల్లపూసల సైన్యం, నేను ఎవరిని ?
Ans. నల్ల చీమల దండు
7. అవి తెల్లని మల్లె మొగ్గలు, పరిమళాలు వెదచల్లవు కానీ, పరి శుభ్రంగా ఉంచుతాయి, అవి ఏంటి?
Ans. ఇయర్ బడ్స్
8. యంత్రం కానీ యంత్రం, నేను ఎవరిని?
Ans. సాయంత్రం
9. అరిచి గోల పెట్టె రాళ్లు, నేను ఎవరిని?
Ans. కీచు రాళ్లు
10. నగరాలూ, పట్టణాలు దాటేస్తుంది,
ఎంతెంత దూరమైనా వెళుతుంది
కానీ ఉన్నచోటు నించి కదలదు, అది ఏంటి ?
Ans. రహదారి
11. కొంచమైనా కాన రాని పసుపు, వొళ్ళంతా పులుపు,పైనేమో నునుపు, నేను ఎవరిని?
Ans. నిమ్మ పండు
12. దొంతర దొంతర దుస్తులు, బంగారు వన్నె జుట్టు
కలిగిన తల్లికి ఎంతో అందమైన పిల్లలు, అవి ఏంటి?
Ans. మొక్కజొన్న కంకి
13. చక్కనమ్మ చిక్కినా అందమే, నేను ఎవరిని?
Ans. సబ్బు
14. చేత్తో పారేసి, నోటితో ఏరుకునేవి, అవి ఏంటి?
Ans. అక్షరాలు
15. నాలుగు కర్రల మధ్య నల్లని రాయి, అది ఏంటి ?
Ans. పలక
16. ఒక స్తంభానికి నలుగురు దొంగలు, నేను ఎవరిని?
Ans. లవంగం
17. కానరాని విత్తనం, ఘనమైన చెట్టు, నేను ఎవరిని?
Ans. మర్రిచెట్టు
18. పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక, నేను ఎవరిని?
Ans. మిరప పండు
19. ఊరంతా తిరిగి, మూలాన కూర్చునేది, నేను ఎవరిని?
Ans. చెప్పులు
20. అది మనకి మాత్రమే సొంతమైనది. కానీ మన కన్నా ఇతరులే వాడుకుంటారు, నేను ఎవరిని?
Ans. పేరు