20 Telugu Podupu Kathalu for Kids with Answers | తెలుగు పొడుపు కథలు
Telugu podupu kathalu || 20 Telugu Riddles for Kids with Answers || తెలుగు పొడుపు కథలు
పొడుపు కధలు తెలుగు జాతికి సరదా సరదాగా మెదడుకి మేతగా, ఆలోచింప చేసే సాధనాలు telugu podupu kathalu.ఈ చిన్న పొడుపుకథలు ఎన్ని చెప్పిన పిల్లలు ఇంకా చెప్పమని అడుగుతూనే ఉంటారు. మీరు కూడా కొన్ని సామెతలు సొంతంగా తయారు చెయ్యటానికి ప్రయత్నించండి. మీ చుట్టూ కనిపించే ఏ వస్తువు అయినా మీరు ఒక పొడుపు కథలా మార్చవచ్చు. ఏమంటారు?
పిల్లల్లో లాజికల్గా ఆలోచించే శక్తిని ప్రేరేపిస్తుంటాయి. ఐతే ఈ పోస్ట్లో మేము 20 telugu podupu kathalani with answers తో సహా ఇచ్చాము.
1. ఎంత దానం చేసిన తరగనిది అంతకంతకు పెరిగేది, అది ఏమిటి?
Ans. విద్య
2. గదినిండా రత్నాలు గదికి తాళం,నేను ఎవరిని ?
Ans. దానిమ్మ పండు
3. కోస్తే తెగదు కొడితే పగలదు,ఏమిటి అది ?
Ans. నీడ
4. నాలుగు కర్రల మధ్య నల్ల రాయి,ఏమిటి అది ?
Ans. పలక
5. చేతికి దొరకనిది ముక్కు దొరుకుతుంది,ఏమిటి అది ?
Ans. వాసన
6. పళ్ళు నా నోరు లేనిది,ఏమిటి అది ?
Ans. రంపం
7. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు,నేను ఎవరిని ?
8. ఆకు చిటికెడు కాయ మూరెడు,నేను ఎవరిని ?
Ans. మునగ కాయని
9. చిట్ట పోటీ చిన్న దానికి చిన్న ఘనమైన లేదు,ఏమిటి అది ?
Ans. గుడ్డు
10. పొద్దున తలుపు తట్టి ఉత్సాహాన్ని ఇచ్చేవాడు జీతం తీసుకోకుండా శుభ్రంగా చేసేవాడు ఆరోగ్యంతో ఆహ్లాదాన్ని పంచే వాడు, ఏమిటి అది ?
Ans. సూర్యుడు
11. తొడిమ లేని పండు ఆకు లేని పంట ఏంటవి ?
Ans. విభూది పండు
12. కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంది, ఏమిటి అది ?
Ans. గురువింద గింజ
13. ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు,ఏమిటి అది ?
Ans. వేరుశెనగ కాయ
14. ఇంట్లో ముగ్గు బయట పువ్వు ,ఏమిటి అది ?
Ans. గొడుగు
15. నువ్వు అన్నదమ్ములకు ఒకటే మొలతాడు, ఏమిటి అది?
Ans. చీపురు
16. పచ్చని బాబుకి రత్నాల ముగ్గులు,నేను ఎవరిని ?
Ans. విస్తరాకు
17. చక్కని స్తంభం చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యగ నుండు,ఏమిటి అది ?
Ans. కొబ్బరి బొండం
18. పిల్ల చిన్నదాన కట్టిన చీరలు ఎక్కువ,ఏమిటి అది ?
Ans. ఉల్లిపాయ
19. ఎందరు ఎక్కిన విరగని మంచం,ఏమిటి అది ?
Ans. అరుగు
20. కారు గాని కారు పరుగులో మహా జోరు,ఏమిటి అది ?
Ans. పుకారు