20 Chilipi Podupu Kathalu in Telugu
చిలిపి పొడుపు కథలు కి స్వాగతం, ఇక్కడ వినోదం మరియు తెలివైన చిక్కులు వేచి ఉన్నాయి! ఈ వినోదభరితమైన Chilipi Podupu Kathalanu ఆస్వాదించండి మరియు మీ మనస్సుకు ఆనందాన్ని మరియు సవాలును అన్వేషించండి.ఈ మెదడు టీజర్‌లు మీకు సవాలు విసురుతాయి మరియు మీ సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతాయి. మీరు ఈ Chilipi Podupu Kathalunu పరిష్కరించగలరా? డైవ్ చేసి తెలుసుకోండి!
1.తనువంతా రంధ్రాలు కానీ తీయగా పాడుతాను.
అది ఏమిటి ?
జవాబు: పిల్లనగ్రోవి
2.చారెడు నీళ్ళల్లో చామంతి బిళ్ళ.
అది ఏమిటి ?
జవాబు: నూనె, నూనె లో వడ
3.గంపెడు శనగల్లో ఒక గులకరాయి.
అది ఏమిటి ?
జవాబు: చందమామ
4.గిన్నె….. గిన్నె లో వెన్న….. వెన్న లో నల్లద్రాక్ష.
అది ఏమిటి ?
జవాబు: కన్ను
5.మా ఇంటి వెనుక ఒక గూనొడు.
అది ఏమిటి ?
జవాబు: నాగలి
6.పాముని చంపుతాను కానీ,
గ్రద్దను కాను, ఒళ్లంతా కళ్లు ఉంటాయి,
కాని ఇంద్రుడుని కాను,
నాట్యం చేస్తాను కానీ శివుడిని కాను,
నేనెవర్ని?
జవాబు: నెమలి
7.ఒళ్లంతా ముళ్ల్లే కానీ రత్నలాంటి బిడ్డలు.
అది ఏమిటి ?
జవాబు: పనస పండు
8.తోలు నలుపు, తింటే పులుపు అది ఏమిటో తెలుపు.
అది ఏమిటి ?
జవాబు: చింతపండు
9.అలాము కొండకు సలాము కొట్టు.
అది ఏమిటి ?
జవాబు: గొడ్డలి
10.అయ్యంటే దూరంగా వెళ్లి అమ్మంటే దగ్గరకు వచ్చేవి ఏమిటి?
జవాబు: పెదవులు
11.అడవిలో అక్కమమ జుట్టు విరబోసుకును కూర్చుంది.
అది ఏమిటి ?
జవాబు: ఈతచెట్టు
12.అరుగు గోడకు అరచేయి.
అది ఏమిటి ?
జవాబు: పిడక
13.కదలలేడు,
కానీ కావలికి గట్టివాడు.
అది ఏమిటి ?
జవాబు: తాళం
14.ఎర్రవాడొస్తే,
నల్లవాడు పారిపోతాడు.
అది ఏమిటి ?
జవాబు: సూర్యుడు, చీకటి
15.బంగారు చెంబులో వెండి గచ్చకాయ,
అది ఏమిటి ?
జవాబు: పనసపండు గింజ
16.బండకు కొడితే వెండి ఊడుతుంది.
అది ఏమిటి ?
జవాబు: కొబ్బరికాయ
17.అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.
అది ఏమిటి ?
జవాబు: కవ్వం
18.నూరు పళ్లు, ఒకటే పెదవి.
అది ఏమిటి ?
జవాబు: దానిమ్మ పండు
19.పైడిపెట్టెలో ముత్యపు గింజ.
అది ఏమిటి ?
జవాబు: వడ్లగింజ
20.పొట్టలో వేలు,
నెత్తి మీద రాయి.
అది ఏమిటి ?
జవాబు: ఉంగరం
మీరు ఈ podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,Podupu Kathalu: Test Your IQ with 20 Telugu Podupu Kathalu దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.