20 Viral Podupu kathalu with Answers
పొడుపు కధలు తెలుగు జాతికి సరదా సరదా గా మెదడుకి మేతగా, ఆలోచింప చేసే సాధనాలు 20 Viral Podupu kathalu with Answers .ఈ చిన్న పొడుపు కథలు ఎన్ని చెప్పిన పిల్లలు ఇంకా చెప్పమని అడుగుతూనే ఉంటారు. మీరు కూడా కొన్ని Podupu Kathalu సొంతంగా తయారు చెయ్యటానికి ప్రయత్నించండి. మీ చుట్టూ కనిపించే ఏ వస్తువు అయినా మీరు ఒక పొడుపు కథలా మార్చవచ్చు. ఏమంటారు?ఐతే ఈ పోస్ట్లో మేము 20 Viral Podupu kathalu with answers తో సహా ఇచ్చాము చూడండి మరియు సరదాగా పాల్గొనండి!
1. అన్నింటి కన్నావిలువైనది అందరికి అవసరమైనది, ఏమిటి అది?
జ: ప్రాణము
2. తమ్ముడు కుంటుతూ మైలు నడిచే సరికి అన్నపరిగేతుతు పండెండు మైళ్ళు నడుస్తాడు ఏమిటి అది?
జ: గడియారం ముల్లు
3. ముల్లుకంచెలో మిటాయి పొట్లం ఏమిటి అది?
జ: తేనే పట్టు
4. అందమైన చిన్నది అందాల చిన్నది నువ్వు చూస్తే నిన్నుచూస్తుంది నేను చూస్తే నన్ను చూస్తుంది ఏమిటి అది?
జ: అద్దం
5. చాచుకొని సావిట్లో పడుకొనే ముసలమ్మ ముడుచుకొని మూలన నిలబడింది ఏమిటి అది?
జ: చాప
6. చెప్పిందే చెప్పినా చిన్నపాప కాదు, ఎక్కడి పండ్లు తిన్న దొంగకాదు ఏమిటి అది?
జ: రామచిలుక
7. నిటి మిద తేలుతుంది కానీపడవకాదు, చెప్పకుండాపోతుంది కానీ జీవికాదు, మెరుస్తుంది కానీ మెరుపుకాదు ఏమిటిఅది?
జ: నీటిబుడుగ
8. కడుపులోన పిల్లలుకంటాం లోననిప్పులు, అరుపెమే ఉరుము, ఎరుపంటేభయం ఏమిటి అది?
జ: రైలు
9. కాటుక రంగు కమలము హంగు విప్పినా పొంగు, ముడిచిన క్రుంగు ఏమిటి అది?
జ: గొడుగు
10. రసం కానీ రసం ఏమి రసం, ఏమిటి అది?
జ: నీరసం
11. కందుకూరి కామక్షి కాటు కపెట్టుకుంది ఏమిటి అది?
జ: గురువింద గింజ
12. ఒక అగ్గిపెట్టాలో ఇదరు పోలీసులు ఏమిటిఅది?
జ: వేరు శానగాకాయ
13. అడవిలుపుట్టింది, అడవిలోపెరిగింది, మాఇంటికి వచ్చింది మహాలక్ష్మిలగుంది ఏమిటి అది?
జ: గడప
14. ఇంటిలోమొగ్గ, బయటపువ్వు ఏమిటిఅది?
జ: గొడుగు
15. నూరుగురు అన్నదమ్ములుకు ఒకటేమొలతాడు ఏమిటి అది?
జ: చీపుర
16. శివరాత్రికిజీడికాయ, ఉగాది ఉరాగయ ఏమిటి అది?
జ: మామిడి పిందే
17. అది లేకపోతే ఎవరు ఏమితినలేరు ఏమిటిఅది?
జ: ఆకలి
18. జామచెట్టు క్రింద జానమ్మ ఎంత లాగిన రాధమ్మ ఏమిటి అది?
జ: నిడ
19. పచ్చనిచెట్టు కింద ఎర్రటిచిలుక ఏమిటిఅది?
జ: మిరపకాయ
20. ముట్టవిప్పితే ముక్కు పట్టుకుంది ఏమిటి అది?
జ: ఇంగువ
మీరు ఈ Podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupukathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,20 Easy Telugu podupu kathalu with Answers దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.